హైదరాబాద్, వెలుగు: ఇండియాలో ప్రీమియర్ అమెచ్యూర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ అయిన హైదరాబాద్ ఓపెన్ టోర్నీ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్‌లో బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో దేశ నలుమూలల నుంచి 300 మందికి పైగా గోల్ఫర్లు పోటీపడుతున్నారు.
చార్మినార్, బుద్ధ విగ్రహం ప్రతిమలతో కూడిన విన్నర్ ట్రోఫీని టీగోల్ఫ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో గోల్ఫ్ ను ప్రోత్సహించడం తమ లక్ష్యమని చెప్పారు. అమెచ్యూర్ గోల్ఫర్లు తమ టాలెంట్ నిరూపించుకోవడానికి నేషనల్ లెవెల్‌లో రాణించడానికి హైదరాబాద్ ఓపెన్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు.
