ముషీరాబాద్, వెలుగు: నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్ పరిసరాల్లో డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ వాడుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జాయింట్ సీపీ జోయల్ డేవిస్, డీసీపీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 30 మందిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏసీపీ మోహన్ కుమార్, ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి పాల్గొన్నారు.
