అల్వాల్లో వెయ్యి గజాల పార్కు స్థలం సేఫ్

అల్వాల్లో వెయ్యి గజాల పార్కు స్థలం సేఫ్

అల్వాల్, వెలుగు: అల్వాల్ మచ్చ బొల్లారం డివిజన్​లోని స్నేహ కాలనీలో ఆక్రమణకు గురవుతున్న పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. 1,008 చదరపు గజాల స్థలాన్ని లేఅవుట్​ఏర్పాటు సమయంలో కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయించగా, కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు గురువారం పరిశీలించారు. స్థలం పార్కు కోసమే కేటాయించిందని నిర్ధారించుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డు ఏర్పాటు చేశారు.