హైదరాబాద్ లో చెరువుల పటిష్ట భద్రతకు హైడ్రా మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కబ్జాలను అరికట్టి కొన్ని ముఖ్యమైన చెరవులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా.. ఇక నుంచి చెరువులను అనునిత్యం నిఘా వ్యవస్థతో పరిరక్షించనుంది. అందులో భాగంగా ప్రతి చెరువు దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. సిటీలోని 264 చెరువుల వద్ద 900 కెమేరాల ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేసింది హైడ్రా.
చెరువుల చుట్టూ ఏర్పాటు చేసిన సీసీకెమెరాలను హైడ్రా ఆఫీస్ లో ఉన్న సర్వర్ కు అనుసంధానం చేసింది. ఈ సందర్భంగా మే 12వ తేదీన హైడ్రా ఆఫీస్ లో సీసీటీవీ వ్యవస్థను ప్రారంభించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. కంట్రోల్ రూం నుంచి 24 గంటల పర్యవేక్షణ ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. చెరువుల్లో మట్టి పోస్తే వెంటనే అలర్ట్ అయ్యి యాక్షన్ లోకి దిగుతామని తెలిపారు.
►ALSO READ | మహబూబ్ నగర్ పాలకొండ బైపాస్ రోడ్డుపై అర్ధరాత్రి తర్వాత హోటళ్లు, ధాబాలు మూసివేత
ఆక్రమణలు, కబ్జాలపై హైడ్రా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది. నిర్మాణ వ్యర్థాలు వేస్తే చర్యలకు సిద్ధమైంది. సీసీటీవీ కెమెరాలు లేక్ ప్రొటెక్షన్ టీమ్ లకు సహాయపడనున్నాయి. చెరువుల్లో మట్టి పోసే వాహనాల వివరాలు సీసీటీవీల ద్వారా గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. బంజారాహిల్స్ ఐసీసీసీకి కెమేరాల లింక్ చేయడంతో నిఘా మరింత పటిష్టమవుతుందని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
