18 కోట్లతో చెరువు సుందరీకరణ : ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

18 కోట్లతో చెరువు సుందరీకరణ : ఎమ్మెల్యే  మల్రెడ్డి రంగారెడ్డి
  • ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  మల్​రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్ట, తూము, కట్ట మైసమ్మ ఆలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు సుందరీకరణకు ప్రభుత్వం రూ.18 కోట్లు కేటాయించిందన్నారు. 

ప్రణాళిక ప్రకారం పనులు స్పీడ్​గా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో  ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, ఆర్ అండ్​ బీ ఎస్ఈ రవిశంకర్, హెచ్ ఎండీఏ ఈఈ రజిత, హెచ్ ఆర్​డీసీఎల్​ ఈఈ మహబూబ్ మియా, పీఆర్ ఈఈ సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.