వీఆర్ఓలను వేరే శాఖలోకి బదిలీ చేస్తే ఊరుకోం

 వీఆర్ఓలను వేరే శాఖలోకి బదిలీ చేస్తే ఊరుకోం

హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల జాబ్ విషయంలో...రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల జేఏసీ డిమాండ్ చేసింది. భవిష్యత్తు కార్యాచరణపై హైదరాబాద్ నాంపల్లి లోని సీసీఎల్ఏ కార్యాలయంలో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమయ్యారు.  తమను వివిధ శాఖలలో ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందన్న వార్తలతో... గ్రామ రెవెన్యూ అధికారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ తెలిపారు. ఆశాస్త్రీయ పద్ధతిలో వీఆర్ఓ పోస్టులను రద్దు చేయడము అమానుషం, ఏకపక్ష నిర్ణయంతో ఏలాంటి ఆలోచన లేకుండా ఇతర శాఖలోకి వీఆర్ఓలను బదిలీ చేస్తే ఊరుకోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమాలోచనచేసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. వీఆర్వోలను రెవిన్యూ శాఖలో సమాన హోదాతో సర్దుబాటు చేయాలని... అర్హులైన వీఆర్వోలను సీనియర్ అసిస్టెంట్లుగా రెవిన్యూ శాఖలోనే పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్దుబాటు ప్రక్రియలో వీఆర్వోల జేఏసీని సంప్రదించిన తదనంతరమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రభుత్వము ఇచ్చే ఉత్తర్వులను ఏ ఒక్క వీఆర్ఓ స్వీకరించబోరని తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించి వీఆర్వోలకు అన్యాయం చేస్తే  న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.