
రంగారెడ్డి జిల్లా: మీర్పేట్ కార్పొరేషన్లో కబ్జా రాయుళ్లు బరితెగించారు. అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వచ్చిన అధికారులపై రాళ్లతో దాడి చేశారు. మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడలోని ప్రభుత్వ భూమిలో కొద్దిరోజులుగా కబ్జా రాయుళ్లు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ అక్రమ నిర్మాణాల గురించి తెలుసుకున్న అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వచ్చారు. తమ నిర్మాణాలను కూల్చేవేస్తున్న అధికారులపై కబ్జారాయుళ్లు రాళ్లతో దాడి చేశారు.
దౌర్జన్యంగా మున్సిపల్ అధికారుల ఫోన్లు లాగేసుకొని బెదిరించారు.
కబ్జాదారులకు లోకల్ అధికార పార్టీ నాయకుడి సపోర్టు ఉన్నట్లు తెలుస్తోంది. కబ్జారాయుళ్లు అధికారులపై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే దాడి చేసిన వారిపై మున్సిపల్ అధికారులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. బడా రాజకీయ నేత ప్రమేయం ఉండటం వల్లే అధికారులు మౌనంగా ఉండిపోయారని స్థానికులు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆకట్టుకునేలా కోస్ట్ గార్డ్ క్యాడెట్ల కవాతు
బౌలర్ కు చుక్కలు..ఒకే ఓవర్లో ఐదు సిక్సులు,ఒక ఫోర్