ఇంటింటికి వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఇంటింటికి వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఇల్లెందు, వెలుగు : ‘ప్రతి గడపకూ సంక్షేమ పథకం’ పేరుతో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనయ్య నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం వానను కూడా లెక్క చేయకుండా తానే స్వయంగా బైక్​ నడుపుతూ ఇల్లెందు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో లబ్ధిదారుల ఇండ్లకు నేరుగా వెళ్లి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, కొత్త రేషన్ కార్డులు అందజేశారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు ఎమ్మెల్యేను కలిసే అవకాశం ప్రజలకు దక్కలేదని, తమ ప్రభుత్వంలో నేరుగా ఎమ్మెల్యేలు, మంత్రులే ప్రజల వద్దకు వస్తున్నారన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్లు  దమ్మలపాటి వెంకటేశ్వరరావు, యదళ్లపల్లి అనసూయ, పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్​ నాయకులు పాల్గొన్నారు.