ఎలక్ట్రిక్ వాహనాల హావా.. కలిసొచ్చిన 2025 ఏడాది.. 20 లక్షలు దాటిన రిజిస్ట్రేషన్లు..

ఎలక్ట్రిక్ వాహనాల హావా.. కలిసొచ్చిన 2025 ఏడాది.. 20 లక్షలు దాటిన రిజిస్ట్రేషన్లు..

 2025 ఏడాది ఎలెట్రిక్ వాహనాలకు కలిసోచ్చినట్టు ఉంది, ఎందుకంటే మొదటిసారిగా మన  దేశంలో 20 లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. అది కూడా ఈ ఏడాది  ఇంకా ముగియడానికి ఒక నెల ముందే  ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.

అయితే  ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ల పెరుగుదలకు కారణాలు చూస్తే  ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు కస్టమర్లు ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలాగే మార్కెట్‌లోకి కొత్త కొత్త EV మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కొనసాగుతోంది. బ్యాటరీల ధరలు తగ్గడం వల్ల కూడా  EVల ధరలు కూడా కొంతవరకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక వీటికి సంబంధించి దేశంలో ఛార్జింగ్ స్టేషన్లు కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల పెరుగుదలలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పాత్ర చాలా కీలకంగా మారింది.  ఎందుకంటే ఈ ఏడాది మొత్తం EV రిజిస్ట్రేషన్లలో 57% వాటా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలదే ఉంది.

పెద్ద కంపెనీలు డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించడం, తక్కువ ధరలలో ఎక్కువ దూరం ప్రయాణించే మోడల్‌లను తీసుకురావడం వలన అమ్మకాలు పెరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు 12 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇక ఎలక్ట్రిక్ కార్లు, SUVల విభాగం కూడా 57% వృద్ధిని నమోదు చేసింది. మిడ్-రేంజ్ మోడల్స్ ఎక్కువ రావడంతో పాటు, EVలను ఉపయోగించడం వల్ల అయ్యే ఖర్చు తగ్గడం వలన వీటి అమ్మకాలు పుంజుకున్నాయి.

సిటీ  నగరాల్లో ఉండే కస్టమర్లు అయితే అటు ఇంట్లో లేదా ఇటు ఆఫీసులో ఛార్జింగ్ చేసుకునే సౌకర్యం ఉండటంతో,  దూర ప్రయాణాలకు ఛార్జింగ్ గురించిన ఆందోళన తగ్గుతోంది. చివరికి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల (ఆటోలు) అమ్మకాలు కూడా ఈ సంవత్సరం ఇప్పటివరకు 6.9 లక్షలుగా ఉన్నాయి.