సర్కార్ జూనియర్ కాలేజీల్లో.. అడ్మిషన్లు  లక్ష దాటినయ్

సర్కార్ జూనియర్ కాలేజీల్లో.. అడ్మిషన్లు  లక్ష దాటినయ్
  • మంత్రి సబితారెడ్డి, లెక్చరర్ల హర్షం   

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో 2021–-2022 అకడమిక్ ఇయర్​కు సంబంధించి ఇప్పటికే లక్ష అడ్మిషన్లు దాటాయి. 405 కాలేజీల్లో గురువారం నాటికి 1,00,687 మంది స్టూడెంట్లు అడ్మిషన్లు పొందారు. వీరిలో18,144 మంది ఒకేషనల్​స్టూడెంట్లు, 82,543 మంది జనరల్ స్టూడెంట్లు ఉన్నారు.  గ్రేటర్ హైదరాబాద్​లోని కాలేజీల్లో స్టూడెంట్లు భారీగా చేరారు. నిరుడు ఫస్టియర్​లో అన్ని కాలేజీల్లో కలిపి 85,993 మంది చేరగా, ఈసారి అడ్మిషన్లు భారీగా పెరగడంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్​రెడ్డి నేతృత్వంలో లెక్చరర్లు.. మంత్రిని, ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ను కలిసి స్వీట్లు పంచి సంతోషం వెలిబుచ్చారు. మంత్రి సబిత.. సిలబస్ మారిన ఫస్టియర్ ఇంగ్లిష్, సెకండ్ ఇయర్ తెలుగు సబ్జెక్టు పుస్తకాలను రిలీజ్ చేశారు.