రెండో టీ20లో దక్షిణాఫ్రికా గెలుపు

 రెండో టీ20లో దక్షిణాఫ్రికా గెలుపు
  • 4 వికెట్లతో సౌతాఫ్రికా గెలుపు
  • క్లాసెస్ ఖతర్నాక్ ఇన్నింగ్స్

కటక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  టీమిండియాకు మరో దెబ్బ. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బౌలర్లు ముంచితే ఈ సారి బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో, ఆదివారం జరిగిన రెండో టీ20లో ఇండియా నాలుగు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది. బౌలర్ల  సమష్టి పోరాటానికి తోడు హెన్రిచ్‌‌‌‌‌‌‌‌ క్లాసెన్‌‌‌‌‌‌‌‌ (46 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 81) ఖతర్నాక్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్​తో వరుసగా రెండో విక్టరీ ఖాతాలో వేసుకున్న సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో 2–0తో ముందంజ వేసింది.

ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తొలుత ఇండియా 20 ఓవర్లకు 148/6 స్కోరు మాత్రమే చేసింది. శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40),  ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ (21 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34), దినేశ్‌‌‌‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌ (21 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2  సిక్సర్లతో 30 నాటౌట్) రాణించారు. అన్రిచ్‌‌‌‌‌‌‌‌ (2/36), రబాడ (1/15) సత్తా చాటారు. అనంతరం క్లాసెన్‌‌‌‌‌‌‌‌ దెబ్బకు సౌతాఫ్రికా 18.2 ఓవర్లలోనే 149/6 స్కోరు చేసి గెలిచింది. పేసర్‌‌‌‌‌‌‌‌ భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ (4/13) నాలుగు వికెట్లు పడగొట్టినా ఫలితం లేకపోయింది. క్లాసెన్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు దక్కింది.  సిరీస్‌‌‌‌‌‌‌‌లో మూడో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మంగళవారం వైజాగ్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది. 
ఆదుకున్న శ్రేయస్‌‌‌‌‌‌‌‌
తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో భారీ స్కోరు చేసిన ఇండియా కటక్‌‌‌‌‌‌‌‌లో తడబడింది.  రబాడ వేసిన న్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఐదో బాల్‌‌‌‌‌‌‌‌కే ఓపెనర్‌‌‌‌‌‌‌‌ రుతురాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ (1) పాయింట్‌‌‌‌‌‌‌‌లో కేశవ్‌‌‌‌‌‌‌‌కు చిక్కాడు. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌ తొలుత జాగ్రత్త పడ్డా.. మరో ఓపెనర్​ ఇషాన్‌‌‌‌‌‌‌‌.. అన్రిచ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్​లో రెండు, పార్నెల్​ ఓవర్లో ఓ సిక్స్​ కొట్టడంతో పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలో ఇండియా 42/1తో మెరుగ్గానే కనిపించింది. కానీ, ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ మారిన తర్వాత సఫారీ బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు.

ఏడో ఓవర్లో  అన్రిచ్‌‌‌‌‌‌‌‌ ఓ షార్ట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌తో ఇషాన్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి ఇండియా స్పీడుకు బ్రేకులు వేశాడు. షంసి వేసిన తొమ్మిదో ఓవర్లో శ్రేయస్‌‌‌‌‌‌‌‌ 4, 6తో  రన్‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌ పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ (5) , హార్దిక్‌‌‌‌‌‌‌‌ (9), అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (10) తక్కువ స్కోర్లకే  వెనుదిరిగారు. మధ్యలో శ్రేయస్‌‌‌‌‌‌‌‌ కూడా ఔటయ్యాడు.  రబాడ, పార్నెల్‌‌‌‌‌‌‌‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో  ఓ దశలో 24  బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఒక్క బౌండ్రీ కూడా రాలేదు. దాంతో, 17 ఓవర్లకు ఇండియా 112/6తో నిలిచింది. అయితే, చివర్లో దినేశ్‌‌‌‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకున్నాడు. హర్షల్‌‌‌‌‌‌‌‌ (12 నాటౌట్‌‌‌‌‌‌‌‌)తో కలిసి విలులైన పరుగులు రాబట్టాడు.  అన్రిచ్‌‌‌‌‌‌‌‌ వేసిన 19వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, ప్రిటోరియస్‌‌‌‌‌‌‌‌ వేసిన ఆఖరి ఓవర్లో  రెండు సిక్సర్లతో ఇండియాకు గౌరవప్రద స్కోరు అందించాడు. 

క్లాసెన్‌‌‌‌‌‌ ధనాధన్‌‌‌‌
చిన్న టార్గెట్‌‌‌‌ను కాపాడుకునే ప్రయత్నంలో భువనేశ్వర్‌‌‌‌ అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేసి ఆశలు రేపినా.. మిగతా బౌలర్లు ఫెయిలయ్యారు. ఇంకోవైపు గాయపడ్డ డికాక్‌‌‌‌ స్థానంలో బరిలోకి దిగిన హెన్రిచ్‌‌‌‌ క్లాసెన్‌‌‌‌ వరుస పెట్టి ఫోర్లు, సిక్సర్లు బాది సౌతాఫ్రికాకు ఘన విజయం అందించాడు. ఆరంభంలో మాత్రం భువనేశ్వర్‌‌‌‌ హవా నడించింది. ఇన్నింగ్స్‌‌‌‌ ఆరో బాల్‌‌‌‌కే ఓపెనర్‌‌‌‌ రీజా హెండ్రిక్స్‌‌‌‌ (4)ను క్లీన్‌‌‌‌బౌల్డ్‌‌‌‌ చేసిన భువీ తన తర్వాతి ఓవర్లోనే నకుల్‌‌‌‌ బాల్‌‌‌‌లో డ్వేన్‌‌‌‌ ప్రిటోరియస్‌‌‌‌ (4)ను పెవిలియన్‌‌‌‌ చేర్చడంతో సౌతాఫ్రికా 13/2తో ఒత్తిడిలో పడింది. హార్దిక్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో సిక్స్‌‌‌‌, అవేశ్‌‌‌‌ ఓవర్లో ఫోర్‌‌‌‌తో కెప్టెన్‌‌‌‌ బవూమ (35)  స్పీడు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, ఆరో ఓవర్లో మళ్లీ బౌలింగ్‌‌‌‌కు వచ్చిన భువీ.. క్లాసిక్‌‌‌‌ బాల్‌‌‌‌తో గత మ్యాచ్‌‌‌‌ హీరో వాండర్‌‌‌‌ డసెన్‌‌‌‌(1)ను బౌల్డ్‌‌‌‌ చేశాడు.  8 ఓవర్లకు సౌతాఫ్రికా36/3తో నిలవగా ఇండియాకే మొగ్గు  కనిపించింది.

ఈ దశలో క్లాసెన్‌‌‌‌ ఒక్కసారిగా ఎదురుదాడి చేశాడు.  చహల్‌‌‌‌ వేసిన తర్వాతి ఓవర్లో 4, 6 కొట్టిన అతను.. హార్దిక్‌‌‌‌ బౌలింగ్​లో 4,4..  అక్షర్‌‌‌‌ వేసిన 12వ ఓవర్లో 4, 6, 4 బాదడంతో   89/3తో సఫారీ జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. క్లాసెన్‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌ ఇచ్చిన బవూమను తర్వాతి ఓవర్లో బౌల్డ్‌‌‌‌ చేసిన చహల్‌‌‌‌.. హోమ్‌‌‌‌టీమ్‌‌‌‌ను రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు.  కానీ, జోరు మీదున్న క్లాసెన్‌‌‌‌కు తోడైన మిల్లర్‌‌‌‌ (20 నాటౌట్‌‌‌‌) ఇండియాకు చాన్స్​ ఇవ్వలేదు. 32 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న క్లాసెన్‌‌‌‌.. హార్దిక్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో సిక్స్‌‌‌‌తో హోమ్‌‌‌‌టీమ్‌‌‌‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆపై, చహల్‌‌‌‌ వేసిన 16వ ఓవర్లో మిల్లర్‌‌‌‌ ఓ సిక్స్‌‌‌‌ కొట్టగా.. క్లాసెన్‌‌‌‌ రెండు సిక్సర్లు రాబట్టి  సఫారీల విజయం ఖాయం చేశాడు. 
సంక్షిప్త స్కోర్లు
ఇండియా:  20 ఓవర్లలో 148/6 (శ్రేయస్‌ 40, కార్తీక్‌ 30 నాటౌట్‌, అన్రిచ్‌ 2/36, రబాడ 1/15)
సౌతాఫ్రికా: 18.2 ఓవర్లలో 149/6 (క్లాసెన్‌ 81, భువనేశ్వర్‌ 4/13).