భారత్–ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసాలు షురూ

భారత్–ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసాలు షురూ

ఇండియన్ ఆర్మీ, ఆస్ట్రేలియన్ ఆర్మీల సంయుక్త సైనిక విన్యాసాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఆస్ట్రాహింద్–2022 పేరుతో ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 11 వరకు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరగనుంది. వివిధ దేశాలతో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించడంతో దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా సాయుధ దళాల సామర్థ్యాలు కూడా మెరుగుపడతాయన్నారు. సాంకేతిక పద్ధతులు, విధానాలు  జాయింట్ ఎక్సర్సైజ్ ద్వారా ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.