Cricket World Cup 2023: సెమీస్ సమరం.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్

Cricket World Cup 2023: సెమీస్ సమరం.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్

వరల్డ్ కప్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ పోరుకు సిద్ధమయ్యాయి. ముంబై వాంఖడే స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణంగా వాంఖడే స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఈ పిచ్ స్లో గా ఉంటుందని తెలుస్తుంది. 

 

also read :- IND vs NZ: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియా 84/1

2011 లో ఇదే వేదికపై టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. 12 ఏళ్ళ తర్వాత ఇదే మైదానంలో జరగనున్న సెమీ ఫైనల్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2015, 2019 వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన భారత్ సెమీ ఫైనల్లో అనూహ్య పరాజయాలను చవి చూసింది. ముఖ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో కివీస్ పై ఓడిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ సారి సొంతగడ్డపై మ్యాచ్ జరగనుండడంతో ఈ మ్యాచ్ లో భారత్ గెలవడం పక్కా అని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా ఉన్న జోరు చూస్తుంటే కివీస్ ను చిత్తు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.  

భారత్ తుది జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్ తుది జట్టు:

డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్