IND vs NZ: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియా 84/1

IND vs NZ: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియా 84/1

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్  పోరులో భారత బ్యాటర్లు జోరు కనపరుస్తున్నారు. ముఖ్యంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(47; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయాడు. అది నుంచే నలుమూలలా బౌండరీలు బాదుతూ కివీస్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకున్నా.. గిల్‌తో కలిసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 84 పరుగులుచేసింది.

also read :- IND vs NZ: మరో వరల్డ్ రికార్డు బ్రేక్.. సచిన్‌ను దాటేసిన కోహ్లీ

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ మంచి శుభారంభం అందించాడు. తొలి వికెట్‌కు గిల్‪తో కలిసి 8.2 ఓవర్లలోనే 71 పరుగులు జోడించాడు. అనంతరం అతడు ఔటైనా అక్కడినుండి గిల్ ఆ జోరు కనపరుస్తున్నాడు. ఒకవైపు నిలకడగా ఆడుతూనే మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 13 ఓవర్లు ముగిసేసరికి 104/1. గిల్(49 నాటౌట్), కోహ్లీ(5 నాటౌట్) ఆడుతున్నారు.