IND vs NZ: మరో వరల్డ్ రికార్డు బ్రేక్.. సచిన్‌ను దాటేసిన కోహ్లీ

IND vs NZ: మరో వరల్డ్ రికార్డు బ్రేక్.. సచిన్‌ను దాటేసిన కోహ్లీ

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలుకొట్టాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్(673) పేరిట ఉన్న 20 ఏళ్లుగా రికార్డును కోహ్లీ అధిగమించాడు. విరాట్80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఘనత సాధించాడు. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్ కోహ్లీ(80 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్(38 నాటౌట్)కు తోడు శుభ్‌మాన్ గిల్(79 నాటౌట్), రోహిత్ శర్మ(47) కూడా రాణించడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ప్రస్తుతానికి 35 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 248 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(80), శ్రేయస్ అయ్యర్(38) క్రీజులో ఉన్నారు.

ఒక ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

  • 674* - విరాట్ కోహ్లీ (2023)
  • 673 - సచిన్ టెండూల్కర్ (2003)
  • 659 - మాథ్యూ హేడెన్ (2007)
  • 648 - రోహిత్ శర్మ (2019)
  • 647 - డేవిడ్ వార్నర్ (2019)