Municipal elections: రంగారెడ్డి జిల్లాలో  చైర్పర్సన్ రేసులో ఉన్నది వీళ్లే..!

Municipal elections: రంగారెడ్డి జిల్లాలో  చైర్పర్సన్ రేసులో ఉన్నది వీళ్లే..!

చైర్మన్​స్థానాలను చేవెళ్ల జనరల్, శంకర్​పల్లి జనరల్​, ఇబ్రహీపట్నం జనరల్​, మొయినాబాద్​ఎస్సీ జనరల్, షాద్​ నగర్​ బీసీ జనరల్, ఆమనగల్ జనరల్​కు కేటాయించారు. చేవెళ్లలో 16 వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించిన సమత వెంకట్ రెడ్డి, మొయినాబాద్​లో 25 వార్డులో జనరల్​ మహిళా స్థానం నుంచి గెలుపొందిన షాబాద్​ సోనియా దర్శన్​(ఎస్సీ)ను  చైర్​పర్సన్​ అభ్యర్థులుగా పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ రెండు స్థానాలు జనరల్​అయినా మహిళలకు అవకాశం ఇస్తుండడం విశేషం.

 శంకర్​పల్లి చైర్మన్​అభ్యర్థిగా ప్రచారం జరిగిన ధర్మన్నగారి వెంకట్​ రెడ్డి 8వ వార్డు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో 15వ వార్డు నుంచి గెలిచిన మాజీ చైర్​ పర్సన్​విజయలక్ష్మి భర్త సాత ప్రవీణ్​ కుమార్, 12వ వార్డు నుంచి గెలిచిన దండు రాజేశ్వర్, షాద్​ నగర్​లో 14 వార్డు నుంచి అందె మోహన్, 23వ వార్డు నుంచి గెలిచిన అగ్గనూరు భశ్వేశ్వర్​ చైర్మన్  రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమన్​గల్​లో బీఆర్ఎస్ పార్టీ తరఫున 5వ వార్డు నుంచి గెలిచిన పాపిశెట్టి రామకృష్ణను చైర్మన్​ అభ్యర్థిగా డిక్లేర్​చేసింది. ఇబ్రహీంపట్నంలో టేకుల సుదర్శన్​ రెడ్డి, ఆకుల యాదగిరి, జెర్కోని మమత రాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.