చేవెళ్ల 1వ వార్డు, 4 వ వార్డులో బీజేపీ అభ్యర్థులకు కేవలం 2 చొప్పున ఓట్లు పడ్డాయి. 13 వ వార్డులో బీఆర్ఎస్అభ్యర్థికి కేవలం 9 ఓట్లు పోలయ్యాయి. 5వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడలేదు. మొయినాబాద్లో బీఆర్ఎస్ 22 వార్డు అభ్యర్థికి కేవలం 5 ఓట్లు, 4, 25 వార్డుల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా పడలేదు.
2 ఓట్లతో విజయం
మొయినాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన గునుగుర్తి శిరీష ఇండిపెండెంట్అభ్యర్థిపై కేవలం 2 ఓట్లతో విజయం సాధించారు. ముందు 5 ఓట్ల మెజార్టీ రాగా.. రీ కౌంటింగ్ చేశారు. ఈ సారి 2 ఓట్ల మెజార్టీ వచ్చింది. మళ్లీ కౌంటింగ్ చేసినా ఫలితం మారలేదు. 9వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ముదిగొండ ప్రభాకర్యాదవ్బీఆర్ఎస్అభ్యర్థిపై కేవలం 4 ఓట్లతో గెలిచాడు.
