పద్మారావునగర్, వెలుగు: నాలుగు నెలల పసికందు కిడ్నాప్ కేసును సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 10న రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేసుకునే మహిళకు మాయమాటలు చెప్పి, ఆమె బిడ్డను గోగ వెంకయ్య, మునగాల శీరిష ఎత్తుకెళ్లారు. టెక్నికల్ ఆధారాలతో వీరిని శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక బైక్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని, శిశువును తల్లికి అప్పగించినట్లు ఇన్ స్పెక్టర్ వి. రామచందర్ తెలిపారు.
