అత్తాపూర్‌‌‌‌‌‌‌‌ లో రక్తపింజర కలకలం

అత్తాపూర్‌‌‌‌‌‌‌‌ లో రక్తపింజర కలకలం
  • త్రుటిలో బాలుడికి తప్పిన ముప్పు

గండిపేట, వెలుగు: అత్తాపూర్‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌ ఎర్రబోడ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ప్రమాదకరమైన రక్తపింజర పాము కలకలం సృష్టించింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాచ్​మెన్‌‌‌‌‌‌‌‌ రమేశ్ ఇంట్లోకి మంగళవారం ఉదయం ఈ విషసర్పం ప్రవేశించింది.

ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న రమేశ్ మూడేండ్ల కొడుకుపైకి పాము దూసుకురావడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై వెంటనే బాలుడిని రక్షించారు. అనంతరం స్థానికులు కర్రలతో పామును తరిమే క్రమంలో దానికి గాయాలై మృతి చెందింది.