
168 పరుగుల తేడాతో భారత్ విక్టరీ
మూడో టీ20లో భారత్ 168 పరుగుల తేడాతో విజయం సాధించింది. 234 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ 66 పరుగులకే ఆలౌట్ అయింది. పాండ్యా 4 వికెట్లు పడగొట్టగా...అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలా రెండు వికెట్లు పడగొట్టారు.
11వ ఓవర్: న్యూజిలాండ్ స్కోరు 65/8
శివమ్ మావి వేసిన 11వ ఓవర్లో కేవలం 9 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో టిక్నర్(1), డార్లీ మిచెల్ (34) పరుగులతో క్రీజులోఉన్నారు.
10వ ఓవర్: పెర్గ్యూసన్ (0) ఔట్, న్యూజిలాండ్ స్కోరు 56/8
235 పరుగుల టార్గెట్ ఛేజింగ్లో న్యూజిలాండ్ బ్యాట్స్మన్ తడబడుతున్నారు. తాజాగా న్యూజిలాండ్ 8 వికెట్ కోల్పోయింది. 54 పరుగుల వద్ద పెర్గ్యూసన్ డకౌట్ అయ్యాడు. ఇక 10వ ఓవర్లో కేవలం 3 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో టిక్నర్(1), డార్లీ మిచెల్ (25) పరుగులతో క్రీజులోఉన్నారు.
9వ ఓవర్: మిచెల్ సాంట్నర్ (13), ఇష్ సోధీ (0) ఔట్
న్యూజిలాండ్ స్కోరు 53/7
235 పరుగుల టార్గెట్ ఛేజింగ్లో న్యూజిలాండ్ బ్యాట్స్మన్ తడబడుతున్నారు. భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ కేవలం 53 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. శివమ్ మావి బౌలింగ్ లో 13 పరుగులు చేసిన సాంట్నర్..ఆ తర్వాత వచ్చిన ఇష్ సోదీ (0) ఔటయ్యారు. ఇక 9వ ఓవర్లో కేవలం 3 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో ఫెర్గ్యూసన్(0), డార్లీ మిచెల్ (23) పరుగులతో క్రీజులోఉన్నారు.
8వ ఓవర్: న్యూజిలాండ్ స్కోరు 50/5
కుల్దీప్ యాదవ్ వేసిన ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో మిచెల్ సాంట్నర్ (12), డార్లీ మిచెల్ (22) పరుగులతో క్రీజులోఉన్నారు.
7వ ఓవర్: న్యూజిలాండ్ స్కోరు 38/5
ఉమ్రాన్ మాలిక్ వేసిన ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో మిచెల్ సాంట్నర్ (8), డార్లీ మిచెల్ (14) పరుగులతో క్రీజులోఉన్నారు.
6వ ఓవర్: న్యూజిలాండ్ స్కోరు 30/5
అర్ష్ దీప్ సింగ్ వేసిన 6వ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో మిచెల్ సాంట్నర్ (1), డార్లీ మిచెల్ (13) పరుగులతో క్రీజులోఉన్నారు.
5వ ఓవర్: బ్రేస్ వెల్ (8)ఔట్, న్యూజిలాండ్ స్కోరు 22/5
చివరి టీ20లో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. ఉమ్రాన్ బౌలింగ్లో బ్రేస్వెల్ (8) ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 21 పరుగులకే సగం వికెట్లు నష్టపోయింది. 5వ ఓవర్లో న్యూజిలాండ్కు ఒకే పరుగు వచ్చింది రాలేదు. ప్రస్తుతం క్రీజులో మిచెల్ సాంట్నర్ (0), డార్లీ మిచెల్ (6) పరుగులతో క్రీజులోఉన్నారు.
1వ ఓవర్ : ఫిన్ అలెన్(3) ఔట్, న్యూజిలాండ్ 4/1
235 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఫిన్ అలెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇక మొదటి ఓవర్లో మొత్తం 4 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో చాప్ మన్ (0), డివాన్ కాన్వేల (1)పరుగులతో ఉన్నారు.
న్యూజిలాండ్ టార్గెట్ 235 రన్స్
చివరి టీ20లో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు చేసింది. 20 ఓవర్లలో భారత్ కు 5 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ లో హార్దిక్ పాండ్యా (30) పరుగులు చేసి ఔటయ్యాడు. శుభ్ మన్ గిల్ 126 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
19వ ఓవర్ : భారత్ 228/3
ఫెర్గ్యూసన్ వేసిన18వ ఓవర్ లో మొత్తం 17 పరుగులు వచ్చాయి.ఈ ఓవర్ లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ వచ్చింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (30), శుభ్‌మన్ గిల్ (123)పరుగులతో ఉన్నారు.
18వ ఓవర్ : భారత్ 211/3
ఫెర్గ్యూసన్ వేసిన18వ ఓవర్ లో మొత్తం 16 పరుగులు వచ్చాయి. గిల్ ఫోర్ , సిక్స్, పాండ్యా ఓ సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (28), శుభ్‌మన్ గిల్ (108)పరుగులతో ఉన్నారు.
గిల్ సెంచరీ
చివరి టీ20లో శుభ్ మన్ గిల్ సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 54 బంతుల్లో 101 పరుగులు సాధించాడు. ఇందులో 5 సిక్సర్లు, 10 ఫోర్లు ఉండటం విశేషం.
13వ ఓవర్ : సూర్యకుమార్ యాదవ్ (24)ఔట్ భారత్ స్కోరు 131 /3
చివరి టీ20లో సూర్యకుమార్ యాదవ్ (24) ఔటయ్యాడు. టిక్నర్ బౌలింగ్ లో బ్రేస్ వెల్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అటు 13వ ఓవర్ లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ సిక్స్ కొట్టగా..హార్దిక్ ఫోర్ బాదాడు. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (5), శుభ్‌మన్ గిల్ (53)పరుగులతో ఉన్నారు.
12వ ఓవర్ : భారత్ స్కోరు 118 /2
సాంట్నర్ వేసిన ఈ ఓవర్లో మొత్తం 6 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (18), శుభ్‌మన్ గిల్ (51)పరుగులతో ఉన్నారు.
గిల్ హాఫ్ సెంచరీ
చివరి వన్డేలో టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 35 బంతుల్లో 7 ఫోర్ల సహాయంతో 50 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 7 టీ20లు ఆడిన గిల్ కు ఇది తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.
11వ ఓవర్ : భారత్ 112 /2
ఇష్ సోధీ వేసిన ఈ ఓవర్లో మొత్తం 10 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో సిక్స్ వచ్చింది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (17), శుభ్‌మన్ గిల్ (47)పరుగులతో ఉన్నారు.
10వ ఓవర్ : భారత్ 102 /2
మిచెల్ సాంట్నర్ వేసిన ఈ ఓవర్లో మొత్తం 8 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో గిల్ ఫోర్ కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (7), శుభ్‌మన్ గిల్ (46)పరుగులతో ఉన్నారు.
9వ ఓవర్ : రాహుల్ త్రిపాఠి (44) ఔట్ భారత్ 94/2
చివరి టీ20లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి ఇష్ సోధీ బౌలింగ్లో ఫెర్గ్యూసన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ ఓవర్లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో ఫోర్, సిక్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజ్లో సూర్యకుమార్ యాదవ్ (6), శుభ్‌మన్ గిల్ (40)పరుగులతో ఉన్నారు.
8వ ఓవర్ : భారత్ 81/1
ఫెర్గ్యూసన్ వేసిన ఈ ఓవర్లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో త్రిపాఠి ఫోర్, సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం క్రీజ్లో రాహుల్ త్రిపాఠి (44), శుభ్‌మన్ గిల్ (38)పరుగులతో ఉన్నారు.
7వ ఓవర్ : భారత్ 69/1
ఇష్ సోధీ వేసిన ఈ ఓవర్లో మొత్తం 9 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ లో త్రిపాఠి ఫోర్ బాదాడు. ప్రస్తుతం క్రీజ్లో రాహుల్ త్రిపాఠి (27), శుభ్‌మన్ గిల్ (38)పరుగులతో ఉన్నారు.
6వ ఓవర్ : భారత్ 58/1
ఫెర్గ్యూసన్ వేసిన ఈ ఓవర్లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. త్రిపాఠి ఫోర్, సిక్సర్ బాదాడు. ప్రస్తుతం క్రీజ్లో రాహుల్ త్రిపాఠి (20), శుభ్‌మన్ గిల్ (34)పరుగులతో ఉన్నారు.
5వ ఓవర్లో 14 పరుగులు : భారత్ 44/1
టిక్నర్ వేసిన ఈ ఓవర్లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. శుభ్‌మన్ గిల్ మూడు ఫోర్లు బాదాడు. ప్రస్తుతం క్రీజ్లో రాహుల్ త్రిపాఠి (9), శుభ్‌మన్ గిల్ (32)పరుగులతో ఉన్నారు.
4వ ఓవర్లో 5 పరుగులు : భారత్ 30/1
బెన్ లిస్టర్ వేసిన ఈ ఓవర్లో మొత్తం 5 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజ్లో రాహుల్ త్రిపాఠి (8), శుభ్‌మన్ గిల్ (19)పరుగులతో ఉన్నారు.
3వ ఓవర్లో 11 పరుగులు : భారత్ 25/1
బెన్ లిస్టర్ వేసిన ఈ ఓవర్లో మొత్తం 11 పరుగులు వచ్చాయి. రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్ చేరో ఫోర్ బాదారు. ప్రస్తుతం క్రీజ్లో రాహుల్ త్రిపాఠి (7), శుభ్‌మన్ గిల్ (15)పరుగులతో ఉన్నారు.
2వ ఓవర్లో 6 పరుగులు : ఇషాన్ కిషన్(1) ఔట్ : భారత్ 14/1
బ్రాస్‌వెల్ వేసిన ఈ ఓవర్లో మొత్తం 8 పరుగులు వచ్చాయి. ఇషాన్ కిషన్(1) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లో రాహుల్ త్రిపాఠి (2), శుభ్‌మన్ గిల్ (11)పరుగులతో ఉన్నారు.
ఫస్ట్ ఓవర్లో 6 పరుగులు : భారత్ 6 /0
- బెన్ లిస్టర్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ఇషాన్ కిషన్(1), శుభ్‌మన్ గిల్ (5)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
టీ20 సిరీస్ విజయమే లక్ష్యంగా న్యూజిలాండ్ తో చివరి టీ20లో భారత బరిలోకి దిగింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో ఓడిన హార్దిక్ సేన..రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేసింది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు పట్టుదలతో ఆడుతున్నాయి.
టీమిండియా తుది జట్టు: హార్దిక్ (కెప్టెన్), గిల్, ఇషాన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ తుది జట్టు: శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, కాన్వే, చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రేస్వెల్,సోధీ, ఫెర్గుసన్, బెంజమైన్ లిస్టర్, టిక్నర్.