
గత ఏడాది దీపావళి నుండి ఈ దీపావళి వరకు భారతీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయిలో నిధుల సేకరణ చూశాయి, సంవత్ 2081లో కంపెనీలు మెయిన్‌బోర్డ్ IPOs, SME IPOs, QIPs ద్వారా ఇప్పటివరకు అత్యధిక మొత్తాన్ని సేకరించాయి. 2081 సంవత్ సమయంలో 433 భారతీయ సంస్థలు రూ.2.9 లక్షల కోట్లకు పైగా సేకరించగా... 2080 సంవత్‌లో 429 సంస్థలు సేకరించిన రూ.2.53 లక్షల కోట్ల కంటే పెరిగింది.
అలాగే 251 సంస్థలు సంవత్ 2079లో దాదాపు రూ. 79,900 కోట్లు సేకరించగా, 165 సంస్థలు సంవత్ 2078 లో రూ. 1.07 లక్షల కోట్లు సేకరించాయి. సెకండరీ మార్కెట్ మందగించినప్పటికీ, లిస్టింగ్ లాభాలు బలహీనంగా ఉన్న ఈ ఘనత సాధించింది, ఇంకా అన్ని వర్గాలలో పెట్టుబడిదారుల నమ్మకాన్ని హైలైట్ చేస్తుంది.
ఈ సంవత్సరం మొత్తం నిధుల సేకరణలో 111 కంపెనీలు మెయిన్‌బోర్డ్ IPOల ద్వారా దాదాపు రూ.1.8 లక్షల కోట్లు సేకరించగా, 275 చిన్న, మధ్యతరహా సంస్థలు (SMEలు) రూ.11,860 కోట్లు సమీకరించాయి.
మరో 47 సంస్థలు QIPల ద్వారా రూ.98,993 కోట్లు సేకరించాయి. బలమైన ఆర్థిక వృద్ధి, అనుకూలమైన మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడిదారుల నమ్మకం పెరగడం ఈ రికార్డుకు కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
అయితే, బలమైన నిధుల సేకరణ ఉన్న, 2025లో లిస్టింగ్ పర్ఫార్మెన్స్ మందగించింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు లిస్టయిన 85 మెయిన్‌బోర్డ్ IPOలలో 29 ఇష్యూ ధర కంటే తక్కువకే ప్రారంభమయ్యాయి.
సంవత్ 2081 అనేది హిందూ నూతన సంవత్సరం. విక్రమ్ సంవత్ 2081 క్యాలెండర్ సంవత్సరం ఏప్రిల్ 2024లో మొదలైంది. ఇది మన సంప్రదాయ భారతీయ, జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం ఉంటుంది. ఈ సంవత్సరం పండుగలకు, మతపరమైన వేడుకలకు చాలా ముఖ్యమైనది. చాలా మంది వ్యాపారులకు, పెట్టుబడిదారులకు ఇది కొత్త ఆర్థిక సంవత్సరం. అందుకే, ఈ సమయంలో కొత్త ప్లాన్స్ వేసుకుని కొత్త పెట్టుబడులు పెడుతుంటారు.