ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు: ఏప్రిల్ 7 లోపు అప్లయ్ చేసుకోండి!

 ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు: ఏప్రిల్ 7 లోపు అప్లయ్ చేసుకోండి!

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ, హైదరాబాద్) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్ట్ పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్.

మొత్తం ఖాళీలు: 6.

విభాగాల వారీగా ఖాళీలు: అప్లికేషన్ స్పెషలిస్ట్ (ఆటమ్ ప్రోబ్ టోమోగ్రఫీ - ఏపీటీ) 1, అప్లికేషన్ స్పెషలిస్ట్ (ట్రాన్స్​మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ -టీఈఎం) 1, అప్లికేషన్ స్పెషలిస్ట్ (టీఈఆర్ఎస్​తో ఏఎఫ్ఎం) 1, అప్లికేషన్ స్పెషలిస్ట్ (ఎఫ్​ఐబీఎస్ఈఎం) 1, అప్లికేషన్ స్పెషలిస్ట్ (ఎఫ్​టీఐఆర్ & ఆప్టికల్ మైక్రోస్కోపీ) 1, అప్లికేషన్ స్పెషలిస్ట్ (స్పీస్​మన్ ప్రిపరేషన్ ఫ్యాకల్టీ) 1. 

ఎలిజిబిలిటీ:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి భౌతికశాస్త్రం / రసాయనశాస్త్రం / పదార్థ విజ్ఞానం / లోహ ఇంజినీరింగ్ / నానోటెక్నాలజీ / జీవశాస్త్రాలు / బయోమెడికల్ ఇంజినీరింగ్ / మెకానికల్ ఇంజినీరింగ్ / కెమికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా సంబంధిత రంగాల్లో మాస్టర్స్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీతోపాటు సంబంధిత రంగంలో ఆరు నెలల అనుభవం ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్:  ఏప్రిల్ 7. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.iith.ac.inను సందర్శించండి.