
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వన్డే ఫార్మాట్‌లో వెస్టిండీస్‌పై వరుసగా 12 సిరీస్ విజయాలతో వరల్డ్ రికార్డు సృష్టించిన ఇండియా టీమ్.. ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై దృష్టిపెట్టింది. బుధవారం వెస్టిండీస్‌తో జరిగే మూడో వన్డేలోనూ గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అదే సమయంలో రిజర్వ్ బెంచ్‌లో ఉన్న కుర్రాళ్లను పరీక్షించాలని చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. బ్యాటింగ్ లైనప్‌లో ఒకటి, రెండు మార్పులు చేయనున్నాడు. ఓపెనర్ గిల్ ప్లేస్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించే చాన్స్ ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్‌కు మరో చాన్స్ దక్కొచ్చు. లేదంటే ఇషాన్ కిషన్‌ను తీసుకునే అవకాశం ఉంది. బౌలింగ్‌లో అవేశ్ ఖాన్ ప్లేస్‌లో అర్షదీప్ సింగ్‌ను ప్రయత్నించొచ్చు. అవేశ్, ప్రసిధ్ బౌలింగ్ ఒకే రకంగా ఉండటంతో ఈ ఇద్దరిలో ఒకరికే చాన్స్ ఉంటుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని విండీస్ భావిస్తోంది. కాగా, ఈ పోరుకు వర్షం ముప్పు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.