యూఎస్ఏ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, బ్రెజిల్, ఇటలీ.. విద్యార్థులు లంచ్ లో ఏం తింటారంటే

యూఎస్ఏ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, బ్రెజిల్, ఇటలీ.. విద్యార్థులు లంచ్ లో ఏం తింటారంటే

ఏ విద్యార్థికైనా పాఠశాలలో అత్యంత ఆత్రుతగా ఎదురుచూసే సమయం ఏదైనా ఉందంటే అది మధ్యాహ్న భోజన విరామ సమయం కోసమే. ఆ టైంలో స్నేహితులతో గడపవచ్చు, భోజనం చేయవచ్చు.. తోటి విద్యార్థులతో ఆడుకోవచ్చు. అందుకని చాలా మంది పిల్లలు లంచ్ టైం అంటే అత్యంత ఆసక్తి కనబరుస్తారు. అయితే ఇన్‌సైడ్ హిస్టరీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లోని పిల్లల లంచ్ బాక్సుల శ్రేణికి సంబంధించిన ఓ పోస్టు చేసింది. ఇందులో తాజా కూరగాయల నుంచి పాస్తా, పండ్లు వరకు ఉన్నాయి. యూఎస్ఏ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, బ్రెజిల్, ఇటలీ, ఫిన్లాండ్, గ్రీస్, ఉక్రెయిన్, స్పెయిన్ సహా వివిధ దేశాల్లోని వివిధ రకాలు భోజనాలు ఈ పోస్టులో ఉన్నాయి

ఈ నెల ప్రారంభంలో ఈ పోస్ట్ షేర్ కాగా.. దీనికి ఇప్పటివరకు 36 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. కానీ ఇది "తప్పు" సమాచారాన్ని చూపిస్తుందని కొందరు విమర్శించారు. "USAలో అత్యంత విచారకరమైన భోజనం ఉందని అందరూ అంగీకరిస్తారు" అని ఇంకొందరు రాసుకొచ్చారు. “ఇతరుల గురించి నాకు తెలియదు, కానీ నేను దక్షిణ కొరియా, ఫ్రాన్స్ రెండు ప్రాంతాల్లోనూ బోధించాను. ఇక్కడ భోజనాలు చాలా ఖచ్చితమైనవిగా కనిపిస్తాయి. ముఖ్యంగా కొరియన్ లంచ్‌లలో, యుఎస్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పుడూ తాజా కూరగాయలను కలిగి లేము” అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.

https://www.instagram.com/p/CsMzgmztmT3/?utm_source=ig_embed&ig_rid=e2ea8a63-3899-4cc6-aae2-090e90ebd3ae