కమీషన్​ ఇస్తమంటూ డబ్బులు కొట్టేస్తున్నరు

కమీషన్​ ఇస్తమంటూ డబ్బులు కొట్టేస్తున్నరు

‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్ లైన్​ ట్రేడింగ్​లో ఇన్వెస్ట్ మెంట్ 
చేయిస్తున్న సైబర్ క్రిమినల్స్
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెస్ట్‌‌‌‌‌‌‌‌ బెంగాల్‌‌‌‌‌‌‌‌, యూపీలో కాల్‌‌‌‌‌‌‌‌ సెంటర్స్
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అలర్ట్ గా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:   ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ పేరుతో సైబర్ క్రిమినల్స్ మోసాలు చేస్తున్నారు. తక్కువ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ఎక్కువ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ వస్తుందంటూ ట్రాప్ చేస్తున్నారు.  ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌,ఇన్‌‌‌‌‌‌‌‌స్ట్రా,ఈ కామర్స్‌‌‌‌‌‌‌‌,బిజినెస్‌‌‌‌‌‌‌‌ సైట్స్‌‌‌‌‌‌‌‌లో ఫేక్ యాడ్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు. గోల్డ్‌‌‌‌‌‌‌‌,సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ పేరుతో రూ.7 కోట్లు చీటింగ్ చేసిన మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అహ్మద్‌‌‌‌‌‌‌‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

ఫ్రాంచైజీలతో అట్రాక్ట్

 సైబర్ క్రిమినల్స్  టిండర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌లాంటి డేటింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌లో ఫేక్‌‌‌‌‌‌‌‌ ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌ క్రియేట్ చేసుకుని ఇతరులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఫేక్ రేటింగ్స్‌‌‌‌‌‌‌‌తో ఉన్న ఫేక్‌‌‌‌‌‌‌‌ కంపెనీల లింక్స్‌‌‌‌‌‌‌‌ ను  వారికి షేర్ చేస్తున్నారు. హై ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌ కంపెనీల పేరుతో ఫేక్ వెబ్‌‌‌‌‌‌‌‌పేజ్‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌చేస్తున్నారు. తమ ట్రాప్ లో చిక్కిన వారిని ఇంటర్నేషనల్ మార్కెట్ లో షేర్స్ కొనాలని చెప్తున్నారు. అమెరికాకు చెందిన ట్రేడింగ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే డైలీ డాలర్లు వస్తాయని నమ్మిస్తున్నారు. ప్రముఖ కంపెనీల ఫ్రాంఛైజీలలో పెట్టుబడులని పెట్టాలని ఫోన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇందుకోసం వెస్ట్‌‌‌‌‌‌‌‌ బెంగాల్‌‌‌‌‌‌‌‌,యూపీలో కాల్‌‌‌‌‌‌‌‌ సెంటర్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. నేషనల్‌‌‌‌‌‌‌‌ కంపెనీల్లో ఇన్వెస్ట్  చేస్తే  డైలీ రూ.2 వేల ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుంచి రూ.లక్ష వరకు ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని చెప్తున్నారు.  బాధితులు ట్రేడింగ్ కంపెనీల వివరాలు తెలుసుకోకుండానే అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు.  డిపాజిట్స్‌‌‌‌‌‌‌‌ చేసిన వారికి మొదట్లో కమీషన్స్‌‌‌‌‌‌‌‌ చెల్లించి తర్వాత  వారు ఇన్వెస్ట్ చేసిన డబ్బును సెక్యూరిటీ డిపాజిట్స్‌‌‌‌‌‌‌‌ పేరుతో కొట్టేస్తున్నారు. చైన్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ చేయించిన వారికి బోనస్‌‌‌‌‌‌‌‌,క్రెడిట్ పాయింట్స్‌‌‌‌‌‌‌‌పేరుతో వర్చువల్ అకౌంట్‌‌‌‌‌‌‌‌ చూపుతున్నారు. ఇలాంటి అమౌంట్‌‌‌‌‌‌‌‌ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో కనిపించినా వాటిని విత్ డ్రా చేసుకునే అవకాశాలు లేకుండా ప్లాన్ చేశారు.   

టిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విమెన్ ప్రొఫైల్​తో

 ఓల్డ్‌‌‌‌‌‌‌‌సిటీకి  చెందిన అభిషేక్‌‌‌‌‌‌‌‌కి టిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్ లో విమెన్‌‌‌‌‌‌‌‌ ప్రొఫైల్ పేరుతో ఓ యువతి పరిచయమైంది.  ఆ యువతి   అభిషేక్‌‌‌‌‌‌‌‌ను ట్రాప్‌‌‌‌‌‌‌‌ చేసి ఫారెక్స్‌‌‌‌‌‌‌‌ ట్రేడ్‌‌‌‌‌‌‌‌లో  ఇన్వెస్ట్ చేస్తే    లాభాలు వస్తాయని నమ్మించింది.  తర్వాత ఫారెక్స్  ట్రేడ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ ఒపీనియన్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలని  ట్రేడర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌అకౌంట్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయించింది. ఫేక్‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌లో రూ.18.20 లక్షలు డిపాజిట్ చేయించింది. మోసపోయినట్లు గుర్తించిన అభిషేక్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.


ఫేక్ వెబ్ పేజ్​లను నమ్మొద్దు 


ఆన్ లైన్ ట్రేడింగ్ విషయంలో ఫేక్ వెబ్ పేజ్ లను నమ్మొద్దు. ఇన్వెస్టర్లు డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేసిన డబ్బులను విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌ లేకుండా సైబర్ క్రిమినల్స్   పక్కా ప్లాన్ గా మోసం చేస్తున్నారు. ఇలాంటి గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ను డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అరెస్ట్ చేశాం. కౌశిక్‌‌‌‌‌‌‌‌ బెనర్జీ, రేఖ జాదవ్‌‌‌‌‌‌‌‌ కలిసి దేశవ్యాప్తంగా 850 మంది నుంచి రూ.34 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించాం.             - కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్