కరోనా ఎఫెక్ట్:  కోల్‌క‌తా-బెంగ‌ళూరు మ్యాచ్ వాయిదా

V6 Velugu Posted on May 03, 2021

ఐపీఎల్‌ 2021 భాగంగా ఇవాళ(సోమవారం) రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది. క‌రోనా క‌ల‌క‌ల‌మే ఇందుకు కార‌ణం. కోల్‌కతా టీమ్‌లో మంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. అంతేకాకుండా ఆటగాళ్లలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఉలిక్కపడ్డ ఫ్రాంఛైజీ ఆ ప్లేయర్స్‌ను ఐసోలేషన్‌కు తరలించింది.

వరుణ్‌ చక్రవర్తితో పాటు సందీప్‌ వారియర్‌కు కరోనా వైరస్‌ సోకడంతో ఈ మ్యాచ్‌ను వాయిదా వేసిన‌ట్లు తెలిసింది.  అహ్మదాబాద్ గ్రౌండ్ లో జ‌ర‌గాల్సిన ఈ మ్యాచ్ రీషెడ్యూల్ తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

కోల్‌క‌తా ఆట‌గాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్‌ వారియర్ ఇటీవ‌ల‌ గాయపడగా, వారిని స్కానింగ్‌ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే.. ఈ సంద‌ర్భంగా వారికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయినట్లు స‌మాచారం.

Tagged IPL 2021: KKR-RCB match postponed, 2 players test COVID positive, match rescheduled 

Latest Videos

Subscribe Now

More News