iQOO కొత్త స్మార్ట్ ఫోన్.. గేమింగ్, మంచి పర్ఫార్మెన్స్ కోసం స్పెషల్ ఫీచర్స్.. ధర ఎంతంటే ?

 iQOO కొత్త స్మార్ట్ ఫోన్.. గేమింగ్, మంచి పర్ఫార్మెన్స్ కోసం స్పెషల్ ఫీచర్స్.. ధర ఎంతంటే ?

చైనా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ iQOO చివరికి కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ కొత్త iQOO 15 క్వాల్కమ్  లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ సిరీస్  OnePlus 15, Realme GT 8 Proకి పోటీగా వస్తుంది.  iQOO 15లో 6.85-అంగుళాల Samsung 2K M14 LEAD OLED ప్యానెల్ ఉంది, డిస్ ప్లే 144Hz వరకు రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, దుమ్ము ఇంకా నీటి నుండి రక్షణగా IP68, IP69 రేటింగ్‌ ఉంది. 

ఫాస్ట్ ఛార్జింగ్ తో 7,000mAh బ్యాటరీ:
7,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కూడిన పెద్ద కెపాసిటీ బ్యాటరీ ఒక ప్రత్యేక ఆకర్షణ. గేమింగ్, మంచి  పర్ఫార్మెన్స్  తో ఈ స్మార్ట్‌ఫోన్లో భారతదేశంలోనే అతిపెద్ద 8K VC కూలింగ్ సిస్టమ్‌ కూడా ఉందని iQOO పేర్కొంది.

 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5తో నడిచే ఈ ఫోన్‌లో 16GB వరకు LPDDR5X అల్ట్రా RAM, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. దీనితో పాటు, ఈ ఫోన్ బూస్ట్డ్ గేమింగ్ అవుట్‌పుట్ కోసం Q3 అనే చిప్‌ కూడా ఉపయోగించింది, అలాగే ఇది హార్డ్‌వేర్-లెవెల్  రే ట్రేసింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ 5  OS  అప్ డేట్స్,  7 సంవత్సరాల సెక్యూటిరీ ప్యాచ్‌లను ఇస్తునట్లు చెబుతుంది. 

పెరిస్కోప్ జూమ్‌తో ట్రిపుల్ 50MP కెమెరాలు:
iQOO 15లో నిజానికి శక్తివంతమైన ట్రిపుల్-కెమెరా సెటప్‌  ఉంది:
1. 50MP సోనీ IMX921 VCS  కెమెరా,
2. 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో (3x ఆప్టికల్, 100x డిజిటల్ జూమ్) కెమెరా,
3.50MP అల్ట్రావైడ్ లెన్స్ కెమెరా
4. సెల్ఫీలు & వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.

వేరియంట్లు, ధర : ఇందులో రెండు ఎడిషన్లు ఉన్నాయి. ఆల్ఫా అనేది మ్యాట్-బ్లాక్ వెర్షన్, లెజెండ్ అనేది ట్రై కలర్ డిజైన్‌ తో ఉంటుంది.

12GB RAM & 256GB స్టోరేజ్: రూ. 72,999 
16GB RAM & 512GB స్టోరేజ్: రూ. 79,999 

డిసెంబర్ 1 నుండి Amazon, iQOO.com, Vivo స్టోర్లు, ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా సేల్స్ ప్రారంభమవుతాయి.