హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో జరుగనున్న ఇరాన్ దేశ ఫిల్మ్ స్క్రీనింగ్ కార్యక్రమానికి హాజరుకావాలని ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆ దేశ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి మోహ్సెన్ కోరారు. గురువారం హైదరాబాద్ లోని మంత్రి అధికారిక నివాసంలో ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య తెలుగు, ఇరానీయన్ సినీ రంగానికి సంబంధించిన పలు అంశాలతో పాటు, టెర్రరిజం పై రూపొందించిన ‘‘వెన్ ద మూన్వాజ్ఫుల్’’ సినిమాపై చర్చ జరిగింది. ఇరాన్ ఫిల్మ్ స్క్రీనింగ్ కార్యక్రమం ఈ నెల 7 నుంచి 9వరకు జరుగనుంది. దీనికి ప్రముఖ దర్శకులు, నటులు హాజరుకానున్నారు.
