కుమారులను కాపాడారని పోలీసులకు సన్మానం

కుమారులను కాపాడారని  పోలీసులకు సన్మానం

జీడిమెట్ల, వెలుగు: పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల ఇద్దరు యువకుల ప్రాణాలు నిలిచాయి. దీంతో బాధితుల తండ్రులు వారిని సత్కరించాడు. వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల పోలీస్​ స్టేషన్ ఎదుట గత జూన్ 28న భానుకిరణ్, శివ బైక్​పై వేగంగా వెళ్తూ బస్సును ఢీకొట్టారు. 

ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న సీఐ మల్లేశ్, పోలీస్​సిబ్బంది వారిని వెంటనే హాస్పిటల్​కు తరలించారు. ఆ యువకులు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. రెండు నిమిషాలు లేటైతే తమ కొడుకులు చనిపోయేవాళ్లని డాక్టర్లు చెప్పారని బాధితుల తండ్రులు పేర్కొన్నారు. ఆదివారం సీఐతోపాటు పోలీస్​సిబ్బందిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.