- కాంగ్రెస్ జిల్లా పరిశీలకుడు భాస్కర్
మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు : పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే పదవులు వస్తాయని కాంగ్రెస్‌జిల్లా పరిశీలకులడు గంజి భాస్కర్ అన్నారు. స్థానిక పార్టీ ఆఫీస్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ పరంగా జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిదే తుది నిర్ణయమన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు.
జిల్లాలోని ప్రతి బ్లాక్‌కు ఒక జిల్లా ఉపాధ్యక్ష పదవి, రెండు జిల్లా ప్రధాన కార్యదర్శులు, ప్రతి మండలానికి ఒక కార్యదర్శి పదవి, జిల్లా కోశాధికారి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక అధికార ప్రతినిధి, మున్సిపల్ కార్పొరేషన్లో జనాభా ఆధారంగా ప్రతి పది డివిజన్లకు ఒక ప్రధాన కార్యదర్శి, ఐదు డివిజన్లకు ఒక కార్యదర్శి పదవులు ఉంటాయని వివరించారు. ఆసక్తి గలవారు ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 31 లేదా వచ్చేనెల మొదటి వారంలో జిల్లా పార్టీ కార్యవర్గాన్ని ప్రకటిస్తామని తెలిపారు.
డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పర్సన్ బెక్కరి అనిత, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, సీజే బెనహర్, సిరాజ్ ఖాద్రీ, వసంత పాల్గొన్నారు.
