న్యూ ఇయర్ వేళ జీరో డ్రగ్స్ విధానం .. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు

న్యూ ఇయర్ వేళ జీరో డ్రగ్స్ విధానం .. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు
  •     పబ్​లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్​ వేదిక వద్ద ప్రత్యేక నిఘా
  •     నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు
  •     సిటీ సీపీ సజ్జనార్ హెచ్చరిక

బషీర్​బాగ్​,వెలుగు : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో  'జీరో డ్రగ్స్' విధానాన్ని అమలు చేయాలని సిటీ పోలీసు కమిషనర్  వీసీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్‌‌‌‌లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌లో శుక్రవారం హెచ్-న్యూ, టాస్క్‌‌‌‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, వెస్ట్ జోన్, సీసీఎస్ తదితర విభాగాల అధికారులతో సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

శుక్రవారం నుంచే నగరంలోని పబ్‌‌‌‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ వేదికల వద్ద ప్రత్యేక నిఘా బృందాలను మోహరించినట్లు తెలిపారు. ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్​మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపైనా నిఘా కొనసాగుతుందని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్‌‌‌‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు కచ్చితంగా రాత్రి ఒంటి గంటకే మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని వార్నింగ్​ ఇచ్చారు. మైత్రీవనం, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌‌‌‌బండ్, కేబీఆర్ పార్క్ సహా జనం అధికంగా ఉండే ప్రాంతాల్లో చెక్‌‌‌‌పోస్టులు, బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీసీపీలు ఎన్.శ్వేత, కె. అపూర్వ రావు, రక్షిత కృష్ణమూర్తి, సిహెచ్. రూపేష్, చింతమనేని శ్రీనివాస్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీలు అందే శ్రీనివాస రావు, ఇక్బాల్ సిద్ధిఖీ తదితర అధికారులు  పాల్గొన్నారు.