జీడిమెట్ల, వెలుగు: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ముఠా గుట్టును మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. శ్రీరామ్‌నగర్‌లోని ఓ ఇంట్లో న్యూఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రూ.4 లక్షల విలువైన 70 గ్రాముల ఎండీఎం డ్రగ్‌తో పాటు 2 కార్లు, 8 సెల్‌ఫోన్స్ సీజ్‌చేశారు. పట్టుబడిన వారిలో డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం.
