జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క సారక్క జాతర సమీపిస్తుండటం..వరుస సెలవులతో భారీగా అంజన్న దర్శనానికి పోటెత్తారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు . ఈ సందర్భంగా వాహనాలు ఎక్కువ సంఖ్యలో రావడంతో వై జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం ట్రాఫిక్ జామ్ అయింది.
ALSO READ : శ్రీవారి దర్శనానికి 2 రోజులు..
కొండగట్టు అంజన్న దర్శనానికి రెండుగంటలకు పైగా సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ( డిసెంబర్ 27) కావడంతో వేకువ జామునుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు, ఉపాలయాలు సందడిగా మారాయి.
