తిరుమల సమాచారం : శ్రీవారి దర్శనానికి 2 రోజులు.. కిలోమీటర్ల భక్తుల క్యూ

తిరుమల సమాచారం : శ్రీవారి దర్శనానికి 2 రోజులు.. కిలోమీటర్ల భక్తుల క్యూ

తిరుమల కొండ కిటకిటలాడుతుంది.   వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత మూడు రోజులు ( డిసెంబర్​ 27 నాటికి)  భారీగా భక్తుల రద్దీ పెరిగింది. ఎటుచూసినా తిరువిధులన్నీ భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠం‌లోని అన్ని కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి షెడ్లలో  భక్తుల స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. శిలాతోరణం వరకు క్యూలైన్ లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. దీంతో  శ్రీవారి ఉచిత సర్వ దర్శనానికి సుమారు 25 గంటల సమయం పడుతోంది. 

 ఇయర్ ఎండింగ్, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం కలిసి రావడంతో  ఇదే విధంగా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. భక్తులకు  ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కిలో మీటర్ల కొద్ది క్యూలైన్లలో నడవ లేక అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. రెండు మూడు రోజులు అయినా దర్శనం చేసుకోలేక పోతున్నారు. అయితే అన్నప్రసాదాలు బాగానే అందుతున్నా..  స్వామి దర్శనానికి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. . .