తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 2025, డిసెంబర్ 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ 2026, జనవరి 20.
ఖాళీల సంఖ్య: 198.
ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టీఎస్టీ) 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) 114.
ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (సమీప జోన్ క్యాడర్ (సీజెడ్సీ)
సీజెడ్సీ I – జోన్–I కాళేశ్వరం 08, జోన్–II బాసర 11, జోన్ –III రాజన్న 13.
సీజెడ్సీ–II జోన్–IV భద్రాద్రి 12, జోన్ V యాదాద్రి 09, VII జోగులాంబ 06.
సీజెడ్సీ–III జోన్ VI చార్మినార్ 25.
మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (సమీప జోన్ క్యాడర్ (సీజెడ్సీ)
సీజెడ్సీ –I - జోన్–-I కాళేశ్వరం 12, జోన్-–II బాసర 17, జోన్–III రాజన్న 19.
సీజెడ్ సీ-–II జోన్-IV భద్రాద్రి 13, జోన్ V యాదాద్రి 11, V II జోగులాంబ 08.
సీజెజ్సీ-III జోన్ –VI చార్మినార్ 34.
ALSO READ : ఐటీఐ,డిప్లొమా చేసిన వారికి గుడ్ న్యూస్..
గమనిక: ఎల్ఆర్– లిమిటెడ్ రిక్రూట్మెంట్ (బ్యాక్ లాగ్) అన్ని ఖాళీలను రెవెన్యూ జోన్ల వారీగా లోకల్ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేస్తారు.
ఎలిజిబిలిటీ: పురుష, మహిళా అభ్యర్థులు అందరూ అర్హులే. మొత్తం ఖాళీల్లో 33 –1/2 శాతం మహిళలకు రిజర్వు చేయబడతాయి.
విద్యార్హతలు
ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2025, జులై 1 నాటికి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి 2025, జులై 1 నాటికి మెకానికల్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. మెకానికల్/ ఆటో మొబైల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్/ బీఈ/ ఏఎంఐఈ పూర్తి అభ్యర్థులు కూడా అర్హులే.
వయో పరిమితి ( 2025, జులై 01 నాటికి):
కనీస వయస్సు: 18 ఏండ్లు.
గరిష్ట వయస్సు: 25 ఏండ్లు.
సడలింపు: తెలంగాణ ప్రభుత్వం 2024, ఆగస్టు 02న జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం. 30 ప్రకారం ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితిని 12 ఏండ్లు పొడిగించారు. దీని ప్రకారం గరిష్ట వయోపరిమితి 37 ఏండ్లు. ఎక్స్‌సర్వీస్‌మన్ మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 30.
అప్లికేషన్ ఫీజు: తెలంగాణ లోకల్ ఎస్సీ, ఎస్టీలకు రూ.400. ఇతరులకు రూ.800.
లాస్ట్ డేట్: 2026, జనవరి 20.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.tgprb.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ: ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. సూపర్‌వైజర్ ఆప్టిట్యూడ్ 60 ప్రశ్నలు 60 మార్కులకు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, రీజనింగ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు.
మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ: ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. సూపర్‌వైజర్ ఆప్టిట్యూడ్ 60 ప్రశ్నలు 60 మార్కులకు, ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, రీజనింగ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఇస్తారు. జనరల్ ఇంగ్లిష్ , ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి.
కనీస అర్హత మార్కులు: ఓసీ, ఈడబ్ల్యూఎస్ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ/ఎస్టీలు 30 శాతం సాధించాల్సి ఉంటుంది.
జోన్ వారీగా ఎంపిక: మొత్తం పోస్టుల్లో 5 శాతం పోస్టులను ఓపెన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. మిగిలిన 95 శాతం పోస్టులను సంబంధిత జోన్ల స్థానిక అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
శిక్షణ, సర్వీస్ బాండ్: ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల శిక్షణ ఉంటుంది. శిక్షణ తర్వాత ఐదేండ్లు కార్పొరేషన్‌లో సర్వీస్ చేయడానికి ఇండెమ్నిటీ బాండ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.
శిక్షణ కాలం (12 నెలలు): ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ చెల్లిస్తారు. డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్)/ డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) మినిమమ్ టైం స్కేల్ చెల్లిస్తారు.
శిక్షణ తర్వాత: శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్)/ డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్)గా రెగ్యులర్ సర్వీసులో నియామకం అవుతారు.
