- ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా సీపీఐ వందేండ్ల పండుగ
సీపీఐ పార్టీ 100 ఏండ్ల వేడుకలను ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ సిటీలో ఆ పార్టీ రాష్ర్ట సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేశారు. అనంతరం వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ భాష్మియా అధ్యక్షతన సభ నిర్వహించగా శ్రీనివాసరావు మాట్లాడారు. భూపాలపల్లిలో జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ స్థానిక రావి నారాయణరెడ్డి భవన్లో జెండావిష్కరణ చేశారు.
జనగామ జిల్లా కేంద్రంలో సీపీఐ ఆఫీస్‌లో జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారారెడ్డి జెండా ఎగురవేశారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు కావటి యాదగిరి ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో పార్టీ వందేండ్ల చరిత్రలను పలువురు వివరించారు.
- కాశీబుగ్గ/ భూపాలపల్లి రూరల్/ జనగామ అర్బన్/ రఘునాథపల్లి, వెలుగు
