కొత్తగూడ, వెలుగు: నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సేవకు అంకితం కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ఆమె మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ రైతువేదికలో కాంగ్రెస్ పార్టీ బలపర్చగా గెలుపొందిన కొత్తగూడ, గంగారం మండలాల కొత్త సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుమెంబర్లను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
రెండు మండలాల్లో పూర్తిస్థాయిలో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, రాష్ర్ట యూత్ కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి కుంజ సూర్య, ములుగు నియోజకవర్గ లీడర్ కుసుమాంజలీ, ఈజీఎస్ స్టేట్ డైరెక్టర్చల్లా నారాయణ రెడ్డి, డీసీసీ సెక్రటరీ రూప్సింగ్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు వజ్జ సారయ్య, జాడీ వెంకటేశ్వర్లు, బ్లాక్కాంగ్రెస్అధ్యక్షుడు సుంకరబోయిన మొగిలి, ఉపాధ్యక్షుడు కర్ర జనార్దన్‌రెడ్డి, డీసీసీ మెంబర్లావణ్యావెంకన్న, మండల అధికార ప్రతినిధి రాజేశ్వర్‌రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్బొల్లు రమేశ్, వెల్డండి వేణు పాల్గొన్నారు.
బ్లాక్ బెర్రీ ఐలాండ్ పునః ప్రారంభించిన మంత్రి..
తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం జనగాలంచ వాగులో అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను శుక్రవారం మంత్రి సీతక్క పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు జిల్లా అంటేనే పర్యటకులకు నిలయం ములుగు జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో బ్లాక్ బెర్రీ ఐలాండ్ ఒక్కటి అని, ఇక్కడ పర్యాటకులకు కనువిందు కలిగించే ప్రదేశాలు సందర్శకులను ఆకర్షించే విధంగా ఉంటాయన్నారు. పర్యాటకులు బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ములుగు కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ తదితరులు పాల్గొన్నారు.
