జనగామ పీఎస్ లో వార్షిక తనిఖీలు

జనగామ పీఎస్ లో వార్షిక తనిఖీలు

జనగామ అర్బన్, వెలుగు: జనగామ పోలీస్ స్టేషన్ లో ఏఎస్పీ పండేరీ చేతన్​ నితిన్​ శుక్రవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏఎస్పీ పోలీస్​ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కిట్ మెయింటెనెన్స్, నీట్​ టర్న్​ ఔట్, విధి నిర్వహణలో క్రమశిక్షణ, వృత్తి పరమైన నైపుణ్యాలు, పీఎస్​కు సంబంధించిన రికార్డులు, కేసు డైరీలు, సీడీ ఫైళ్లు, వివిధ రిజిస్టర్లు, ఇతర అధికారిక దస్తావేజులను పరిశీలించారు. 

కేసుల నమోదు విధానం, పెండింగ్​ కేసుల స్థితిగతులు, దర్యాప్తు పురోగతి, రికార్డుల అప్డేట్, స్టేషన్​ పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సైబర్​ నేరాలు, ట్రాఫిక్​ఉల్లంఘనలు, ప్రజా శాంతిభద్రతలు, లా అండ్​ఆర్డర్ అంశాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సైలు రతీశ్, చెన్నకేశవులు, భరత్​, నర్సయ్య, హెడ్ కానిస్టేబుల్​ సిరాజ్, యాదగిరి, కానిస్టేబుళ్లు కృష్ణ, లక్ష్మణ్, కరుణాకర్, బాలమల్లయ్య పాల్గొన్నారు.