V6 News

ఇండిగోకి తప్పిన ప్రమాదం: రన్‌వేను తాకిన విమాన వెనక భాగం.. ప్రయాణికులు సేఫ్..

ఇండిగోకి తప్పిన ప్రమాదం: రన్‌వేను తాకిన విమాన వెనక భాగం.. ప్రయాణికులు సేఫ్..

జార్ఖండ్‌లోని రాంచీ విమానాశ్రయంలో ఓ ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా వెనక భాగం రన్‌వేను తాకింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి 7:30 గంటలకు జరిగింది. అయితే ఈ విమానం భువనేశ్వర్ నుండి రాంచికి రాగ... ఇందులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఏం జరిగిందంటే: విమానం కిందకి దిగేటప్పుడు దాని తోక భాగం రన్‌వేను తాకింది. దింతో ప్రయాణికులకు ఒకసారిగా కుదుపు వచ్చింది. అయితే, అందరూ క్షేమంగానే ఉండగా... ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటన తర్వాత విమానాన్ని కాసేపు నిలిపివేశారు అలాగే విమానం ప్రయాణించడానికి అంత మంచిది కాదని తేల్చారు.

దీంతో, రాంచీ నుండి భువనేశ్వర్‌కు తిరిగి వెళ్లాల్సిన ఈ విమానాన్ని రద్దు చేశారు. కొంతమంది ప్రయాణికులు వారి ప్రయాణాన్ని రద్దు చేసుకుగా... మరికొందరు ప్రయాణన్నీ తరువాతా రోజుకు మార్చుకున్నారు. ఇంకొంతమందిని రోడ్డు మార్గంలో భువనేశ్వర్‌కు పంపించారు.