
గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. కర్ణాటక ప్రాజెక్టులతోపాటు భీమా నది నుంచి వరద జూరాల ప్రాజెక్టుకు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు దగ్గర 317.910 మీటర్ల లెవల్ నీటిని నిల్వ ఉంచుకొని మంగళవారం 43 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు.
గేట్ల ద్వారా 2,97,904 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 25,661 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్టు-–2కు 750 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ కు 390 క్యూసెక్కులు, రైట్ కెనాల్ కు 580 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి 3,25,354 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.