కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్అండ్డ్రైవ్లో పట్టుబడిన 10 మందికి ఒక రోజు జైలు శిక్ష, 28 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్టు ఎస్పీ రాజేశ్చంద్ర మంగళవారం తెలిపారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురికి ఒక రోజు జైలు శిక్ష, 23 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానా పడిందన్నారు. దేవునిపల్లి స్టేషన్ పరిధిలో ఆరుగురికి రూ.వెయ్యి చొప్పున జరిమానా, మాచారెడ్డి పరిధిలో ఒకరికి, భిక్కనూరు పరిధిలో ఒకరికి జరిమానా విధించినట్లు తెలిపారు.
దోమకొండ స్టేషన్ పరిధిలో నలుగురికి జరిమానా, ఒకరికి జైలు శిక్ష విధించగా, బీబీపేట పరిధిలో ఒకరికి జరిమానా, తాడ్వాయి పరిధిలో ఇద్దరికి జరిమానా, ఒకరికి జైలు శిక్ష పడినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
