హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు

హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు

అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో కరీంనగర్ లోని స్టార్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు సీపీ సత్యనారాయణ. విద్యార్థులకు సమస్యలుంటే ప్రజాస్వామ్యయుతంగా తెలియజేయాలి తప్పా..హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దన్నారు. క్రిమినల్ కేసులుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు రావని చెప్పారు. రైళ్లు, బస్సులు తగలబెట్టడం సరికాదని.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సక్సెస్ కు షార్ట్ కట్ ఉండదని.. భవిష్యత్తులో విజయం సాధించాలంటే కష్టపడాలని సూచించారు. విద్యార్థులకు టైమ్ మేనేజ్మెంట్ ఎంతో ముఖ్యమన్నారు.  మొన్నటి సికింద్రాబాద్ ఘటనకు కరీంనగర్ నుంచి చాలా మంది వెళ్లారని..అటువంటి వాటిల్లో పాల్గొంటే భవిష్యత్ నాశనమవుతుందని స్పష్టం చేశారు