మీకేం కోపమొచ్చిందో.. పాలిచ్చే బర్రెను అమ్మేసి.. దున్నపోతును తెచ్చుకున్నరు

మీకేం కోపమొచ్చిందో.. పాలిచ్చే బర్రెను అమ్మేసి.. దున్నపోతును తెచ్చుకున్నరు

మనల్ని మనం కాపాడుకోవాలి. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడాలి. నీళ్ల దోపిడీ చేసే వాళ్లకు నల్గొండ సభ ఒక హెచ్చరిక అని అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక్క పిలుపుతో కదలి వచ్చిన.. నా అన్నదమ్ములకు, అక్కచెల్లె్ల్లకు ఉద్యమాభి వందనాలు తెలుపుతున్నానని కేసీఆర్ చెప్పారు. ఫిబ్రవరి 13వ తేదీ బంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. కొందరికి ఇద రాజకీయ సభ.. కానీ మాకు, ఇది రాజకీయ సభ కానే కాదు.. ఇది పోరాట సభ అన్నారు. నీళ్లు లేకపోతే మన బతుకు ఆగమైతదని.. 24ఏళ్లుగా నేను పక్షిలాగా రాష్ట్రం మొత్తం తిరుగుతూ కృష్ణా జలాల గురించి చెప్పానన్నారు.

"నల్గొండలో ఫ్లోరైడ్ భూతంపై ఏ నాయకుడూ పట్టించుకోలేదని..  ఇక్కడ ఫ్లోరైడ్ బాధలు తీర్చిందే బీఆర్ఎస్ అన్నారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి తెలంగాణను తెచ్చుకున్నాం. ఈ గడ్డను 10 సంవత్సరాలు పరిపాలన చేశాను. నేనేం తక్కువ చేయలే. ఎక్కడనో పోయిన కరెంట్ తెచ్చి.. మీ అందరికి 24 గంటల కరెంట్ ఇప్పించిన. ప్రతి ఇంట్లో నల్ల పెట్టి నీళ్లు తీసుకొచ్చుకున్నం. ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్గొండలో.. బత్తాయి తోటలతో బతికిన నల్గొండలో.. లక్షలకు లక్షల టన్నుల వడ్లు పండించుకున్నం. అంతకుముందు లేని నీళ్లు ఇప్పుడు ఎక్కడికెళ్లి వచ్చియ్. మంచి చెయ్యాలి అనే దమ్ము, ధైర్యం ఉండాలి. అలా చేశాం కాబట్టే..తెలంగాణలో కృష్ణా, గోదావరి నీళ్లు పరుగులు పెడుతున్నాయని చెప్పారు. మీకేం కోపమొచ్చిందో.. ఎందుకు లొంగిపోయారో తెల్వదు కానీ.. పాలిచ్చే బర్రెను అమ్మేసి.. దున్నపోతును తెచ్చుకున్నారు" అని ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ అన్నారు.