టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢిల్లీలో వీధి నాటకాలు మొదలెట్టారు

టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢిల్లీలో వీధి నాటకాలు మొదలెట్టారు

టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢిల్లీలో వీధి నాటకాలు మొదలు పెట్టారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల రాక్షస క్రీడలో అమాయక రైతులు బలి అవుతున్నారన్నారు.  ఢిల్లీలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజల పరువు తీస్తున్నారన్నారు. తన  దగ్గర అన్ని వివరాలు ఉన్నాయన్న అమిత్ షా కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కు మధ్య ఉన్న అనుబంధం, ఒప్పందం బహిర్గతం చేయాలన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారన్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేసీఆర్ అమిత్ షా డైరెక్షన్ లో రాజకీయ నాటకాలు ఆడుతున్నారన్నారు. కేసీఆర్ తన వ్యూహాల మీద నమ్మకం కోల్పోయి, సునీల్ అనే రాజకీయ వ్యూహకర్త డైరెక్షన్ లో నడుస్తున్నారన్నారు. సునీల్ అనే వ్యూహకర్త బీజేపీ టీఆర్ఎస్ లకు నాయకుడిగా మారారన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సీవీసీ, సీబీఐ తో విచారణ జరిపించాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి బాగోతం అందరికీ తెలుసని.. అయినా కేంద్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. 

మరిన్ని వార్తల కోసం

హైదరాబాద్ లో పెరిగిన క్రైమ్ రేట్ 

తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు