బీజేపీని తరిమికొట్టే శక్తి ఎవరికీ లేదు

బీజేపీని తరిమికొట్టే శక్తి  ఎవరికీ లేదు

హుజురాబాద్ ఫలితాలతో కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఎవరు వ్యతిరేకించినా కేసీఆర్ సహించడం లేదన్నారు. కేసీఆర్ వ్యవహార శైలి తెలంగాణ సమాజం అసహ్యించుకునేలా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఇంత దిగజారుతాడా? అని ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నాడన్నారు. ముఖ్యమంత్రి పదవి స్థాయిని తగ్గించే విధంగా కేసీఆర్  వ్యవహరిస్తున్నారన్నారు. తనను ప్రశ్నించే వాళ్లు ఉండకూడదని కేసీఆర్ భావిస్తున్నారన్నారు.  కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. మోడీని అవమానించేలా కేసీఆర్ మాటలు ఉన్నాయన్నారు. కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారన్నారు.  టీఆర్ఎస్ ,కేసీఆర్  వాడే భాషలో తాము మాట్లాడలేమన్నారు. తమకు  శత్రుత్వం ఒక్క పాకిస్తాన్ తోనే అని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అనుగుణంగా, సైన్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా కేసీఆర్ మాటలున్నాయన్నారు.. నిజాం పరిపాలనలా రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాడన్నారు. 

గత ఏడున్నర సంవత్సరాలుగా మోడీ ఏం చేయలేదని కేసీఆర్ అన్నారని... మోడీ ఏం చేశారో తాము చర్చకు సిద్ధమన్నారు. అమరవీరుల స్థూపం దగ్గర మీడియా ముందు కేసీఆర్ తో చర్చించేందకు సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ ప్రజలు మాట్లాడే భాషతోనే చర్చకు సిద్ధమన్నారు.  మా పార్టీకి దేశమే ముఖ్యం..వ్యక్తులు కానీ కుటుంబాలు కానీ ముఖ్యం కాదన్నారు. టీఆర్ఎస్ కు కుటుంబం, అధికారం ముఖ్యం అని అన్నారు. బీజేపీని తరిమికొట్టే శక్తి ఈ భూ ప్రపంచంలోనే ఎవరికీ లేదన్నారు.  తెలంగాణ నిర్ణయాలన్నీ కేసీఆర్ డైనింగ్ టేబుల్ పై జరుగుతాయి కానీ కేబినెట్ లో కాదన్నారు.  సర్జికల్ స్ట్రైక్స్ పై కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. కొన్ని సంఘటనలు జరిగితే చేతులు ముడుచుకుని కూర్చోబోమన్నారు.  బోర్ల దగ్గర మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. పెట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదన్నారు. కేసీఆర్ తన రాజకీయ లబ్ధి కోసమే అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు కిషన్ రెడ్డి. యూరియా మీద వందకు వంద శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. త్వరలోనే రామగుండం యూరియా ఫ్యాక్టరీని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారన్నారు.