జాబ్ క్యాలెండర్ కోసం 7 ఏళ్ల నుంచి పోరాడుతున్నామన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. ఏ సంవత్సరం ఖాళీలను ఆ సంవత్సరమే భర్తీ చేయాలని కేబినెట్ మంచి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఉద్యోగాల భర్తీ కోసం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు కోదండరాం.