కోహ్లీ కిర్రాక్ హెయిర్ స్టైల్..

కోహ్లీ కిర్రాక్ హెయిర్ స్టైల్..

విరాట్ కోహ్లీ ట్రెండ్ను ఫాలో అవడు..ట్రెండ్ సెట్ చేస్తాడు. క్రికెట్లో ఎన్నో రికార్డులను నెలకొల్పి ట్రెండ్సెట్ చేశాడు. ఇటు తన డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్లోనూ విభిన్న లుక్లతో కనిపిస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు న్యూ లుక్లో దర్శనిమిస్తూ..అభిమానులను అలరించే కోహ్లీ..తాజాగా మరో కొత్త హెయిర్ స్టైల్తో ఆకట్టుకుంటున్నాడు. 


 
టీ20 వరల్డ్ కప్ కోసమేనా..?
కోహ్లీ తన డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో అనేక ప్రయోగాలు చేస్తూ కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇక ఐసీసీ ఈవెంట్లు, ఇతర మేజర్ సిరీస్లకు కొత్త హెయిర్ స్టైల్ మారుస్తుంటాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో మరోసారి కొత్త హెయిర్ స్టైల్లో కనిపించబోతున్నాడు. 

 న్యూ లుక్ ఫర్ కింగ్ కోహ్లీ
సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ రషీద్ సల్మాని...కోహ్లీకి హెయిర్ కట్ చేసి కొత్త లుక్ ఇచ్చాడు. కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్కు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.  దీనికి న్యూ లుక్ ఫర్ కింగ్ కోహ్లీ అని క్యాప్షన్ కూడా  ఇచ్చాడు. ప్రస్తుతం ఈ  ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కోహ్లీ కొత్త లుక్ను చూసి నెటిజన్లు పాజిటీవ్  కామెంట్స్ చేస్తున్నారు. 

ఆసియాకప్లో ఫాంలోకి కోహ్లీ
గత కొంత కాలంగా ఫాంలో లేక సతమతమైన కోహ్లీ...దాదాపు వెయ్యి 20 రోజుల తర్వాత సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత బ్రేక్ తీసుకుని ఆసియాకప్లో బరిలోకి దిగాడు. ఆసియాకప్లో ఫాంలోకి వచ్చిన కోహ్లీ..5 మ్యాచుల్లో 5 ఇన్నింగ్స్ లు ఆడి 92 సగటుతో 276 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉండటం విశేషం. అయితే వచ్చే నెలలో  ఆస్ట్రేలియాలో టీ 20 వరల్డ్ కప్లో కోహ్లీ భారత జట్టుకు కీలకం కానున్నాడు. అంతకంటే ముందు  ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో విరాట్ ఆడబోతున్నాడు.