
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్
హైదరాబాద్, వెలుగు: తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను మంత్రిగా లేకపోయినా.. కాంగ్రెస్ ను బలపరిచే ప్రయత్నాల్లో భాగంగా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని తెలిపారు. కొన్నిసార్లు పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం నాయకుడిని ఎంతో శక్తివంతంగా మారుస్తుందని బుధవారం ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. అదే మార్గాన్ని తాను ఎంచుకున్నానని పేర్కొన్నారు. ప్రజల గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటానని తెలిపారు.