మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ లోని చాంబర్లో కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అధికారులు పాల్గొన్నారు. వేదపండితులు కోమటిరెడ్డిని ఆశీర్వదించారు.

 తెలంగాణలో కొలువుదీరిన కొత్త మంత్రి వర్గంలో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం సినిమాటోగ్రపీ శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే.

ఇంతకు ముందు ఉన్న మినిస్టర్  తలసాని  శ్రీనివాస్ యాదవ్  ఎంతో కొంతవరకు సహకరించినప్పటికీ..ప్రస్తుతం కొత్త సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ టాలీవుడ్‌ కి ఎంత మేరకు సహకారం అందిస్తుందో  చూడాలి. 

సినీ కార్మికులకు ఉన్న కష్టాలు,జూనియర్ ఆర్టిస్టులకు ఉన్న సమస్యలు, మేకింగ్ కొరకు కొత్త పర్మిషన్లు ఇలా..సంక్షేమం వంటి విషయాల్లో ఎలాంటి కొత్త నిర్ణయాలతో మంత్రిత్వ శాఖ సహకరిస్తుందేమో చూడాలి. సంక్షేమంలో భాగంగా అందరూ కోరుకుంటున్న నంది అవార్డులను కనీసం ఈ సారైనా వచ్చిన కొత్త  ప్రభుత్వం అయినా పెద్ద మనసు చేసుకొని ఇస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ పెద్దలు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ సమానంగా అందరికీ నంది అవార్డులు ఇచ్చిన విషయం తెల్సిందే. త్వరలోనే నంది అవార్డుల విషయంలో టాలీవుడ్‌ ప్రముఖులు మంత్రి కోమటిరెడ్డిని కలిసి చర్చించే అవకాశాలు ఉన్నాయని సినిమా ఇండస్ట్రీ విశ్లేషకుల నుండి సమాచారం.