కాంగ్రెస్ ఒక్క హామీ నెరవేర్చలే : కేటీఆర్

కాంగ్రెస్ ఒక్క హామీ నెరవేర్చలే : కేటీఆర్
  • రాష్ట్రంలో అన్ని రంగాల్లో 
  • ప్రభుత్వం విఫలం: కేటీఆర్​
  • ఇందిరమ్మ రాజ్యం అంటే హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టుడా? 
  • తోక జాడిస్తున్న పోలీసుల పనిచెప్తామని వార్నింగ్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: పదేండ్లలో రాష్ట్రంలో రియల్​ఎస్టేట్​ వెలుగొందిందని, రెండేండ్లలో కాంగ్రెస్​వల్లే పడిపోయిందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆరోపించారు. రాష్ట్రంలో రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. శనివారం జూబ్లీహిల్స్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ వద్ద జరిగిన రోడ్​షోలో కేటీఆర్​ ప్రసంగించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదని అన్నారు. కేసీఆర్ ​పేదల కోసం ఇండ్లు నిర్మిస్తే.. కాంగ్రెస్​ ప్రభుత్వం హైడ్రాను అడ్డంపెట్టుకొని వాటిని కూలుస్తున్నదన్నారు. 

‘‘ఒక్క చాన్స్​ అని సీఎం రేవంత్​రెడ్డి అడుగుతున్నారు. ఒక్క చాన్స్​ ఇచ్చినందుకే 800‌‌‌‌‌‌‌‌ మంది రైతులను ఆగం చేశారు. 106 మంది ఆటోడ్రైవర్ల ఉసురు తీసుకున్నారు” అని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి..  ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్​ పార్టీకి జూబ్లీహిల్స్​ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.  

మళ్లీ బీఆర్ఎస్​ ప్రభుత్వమే

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్​ విమర్శించారు. ‘‘ కేసీఆర్ హయాంలో​ పదేండ్లపాటు ఆనందంగా బతికినం. కేసీఆర్​ బాగా  చూసుకున్నారు. పెన్షన్​ 200 నుంచి 2 వేలు చేశారు.  కల్యాణలక్ష్మితో పేద పిల్లకు పెళ్లిళ్లు జరిగాయి.  కేసీఆర్​కిట్, 58, 58 జీవోలతో పేదలకు ఇండ్ల పట్టాలు, ఇంటింటికీ ఉచిత నీటి సదుపాయం కల్పించినం. అందరినీ ఆదుకున్నం” అని తెలిపారు.  కాంగ్రెస్​పార్టీ 420 మోసపూరిత హామీలతో ప్రజల్ని  మోసం చేసిందని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కట్డుడు కాదు.. కూలగొట్టుడు అని మండిపడ్డారు. వేల ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చారని, ఈ ఎన్నికలు కారుకు, బుల్డోజర్​మధ్య పోరాటమని తెలిపారు. 

కాంగ్రెస్​ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌​ నాయకులు, కార్యకర్తలను బెదిస్తున్నారని కేటీఆర్​ఆరోపించారు.  ‘‘పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. 500 రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్​ ప్రభుత్వమే వస్తుంది. అందరినీ గుర్తు పెట్టుకుంటాం.  తోకలు కట్‌‌‌‌చేస్తం” అని హెచ్చరించారు. ఈ నెల 14న తమ సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు.  నోట్లతో ఓట్లు  కొనాలని అనుకుంటున్నారని, మాగంటి గోపీనాథ్‌‌‌‌​ భార్యపై కూడా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గోపీనాథ్‌‌‌‌ యాదిలో తాము ఆయన భార్య సునీతకు అండగా నిల్చుంటామని చెప్పారు.